Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
పోలీసు దర్యాప్తు, కేసుల చేదనలో పోలీస్ శాఖ అత్యంత సాంకేతికత, ఆధునిక పద్ధతుల్లో ప్రణాళిక ప్రకారం పని చేస్తుంది. తప్పులు, నేరాలకు పాల్పడితే త్వరితగతిన కేసులు చేదించి, సాంకేతికత ఆధారాలు, బలమైన సాక్షాదారాలతో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు అమలు అయ్యేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ నరసింహ తెలిపారు.

Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
తుంగతుర్తి, మన సాక్షి
పోలీసు దర్యాప్తు, కేసుల చేదనలో పోలీస్ శాఖ అత్యంత సాంకేతికత, ఆధునిక పద్ధతుల్లో ప్రణాళిక ప్రకారం పని చేస్తుంది. తప్పులు, నేరాలకు పాల్పడితే త్వరితగతిన కేసులు చేదించి, సాంకేతికత ఆధారాలు, బలమైన సాక్షాదారాలతో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు అమలు అయ్యేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు ఎస్పీ నర్సింహ తుంగతుర్తి పోలీస్ స్టేషన్ తనకి చేశారు. ముందుగా స్టేషన్ సిబ్బంది గౌరవ వందనంతో ఎస్పీ కి స్వాగతం తెలిపారు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పోలీస్ కవాతు, పోలీస్ సామాగ్రి పరిశీలించి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సిబ్బందితో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు, ఫిర్యాదుల నిర్వహణ అంతర్జాలం నమోదు పరిశీలన చేసి ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని ఫిర్యాదులపై వేగంగా దర్యాప్తు చేయాలని సూచించారు. అనంతరం స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు.
స్టేషన్ పరిధిలో ఉన్న సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ విలేజ్ హిస్టరీ సీట్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరుగుతున్న పనితీరుపై డిఎస్పి సీఐ స్థాయి అధికారులు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలి అన్నారు. నేనుసైతం కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాలు పెట్టుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు బాధితులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. తప్పుడు ప్రవర్తన, నేర ప్రవృత్తి ఉన్న వారి పట్ల పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని హెచ్చరించారు.
ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురి చేసినట్లయితే అలాంటి వారిపై రౌడీషీట్ నమోదు చేసి పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీసు దర్యాప్తులో సాంకేతికత ఆధునికత పద్ధతులు అవలంబిస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా వివాదం కలిగించిన, ప్రజలకు ఇబ్బందులు కలగజేసిన అలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటాము.
సమస్యలపై బాధితులు పోలీస్ సహాయం కోసం డయల్ 100, డయల్ 112 కు ఏ క్షణంలోనైనా ఫోన్ చేయవచ్చును, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసి కేసు పత్రాలు అందిస్తున్నాము. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకున్నాము అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత ఉద్యమం కార్యక్రమం తో ప్రతి గ్రామానికి వెళ్లి రోడ్డు భద్రత ప్రమాదాల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాము.
ప్రస్తుత సమాజంలో గాంజాయి తన యువతను పీడిస్తున్నది దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక నిగా ఏర్పాటు చేస్తాము గతంలో గంజాయి సంబంధిత కేసుల్లో ఉన్న వారిపై నిగా ఉంచాము ప్రతినెల వారి స్థితిగతులు పరిశీలిస్తున్నాము. మహిళల భద్రతలో అధిక ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నాము. సైబర్ మోసాల పై ప్రత్యేక సాంకేతికతతో సైబర్ మోసాలను చేదిస్తున్నాము సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలు చైతన్యవంతం అవ్వాలి అపరిచితులు ఏదైనా ఆశ చూపితే నమ్మి డబ్బులు చెల్లించటం కానీ బ్యాంకు వివరాలు తెలపడం కానీ చేయకూడదు.
ప్రజలకు భద్రత కల్పించడం దొంగతనాలు నివారించడంలో భాగంగా పోలీస్ సిబ్బంది రాత్రింబవళ్లు పటిష్టంగా పనిచేస్తున్నారు. నకిలీ విత్తనాల పట్ల రైతన్నలు అప్రమత్తంగా ఉండాలివర్షాభావపరిస్థితులకుతగ్గట్టుగాపంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు, ఈ సీజన్లో వరి ధాన్యం ఎక్కువగా పండిందని కొనుగోలు కేంద్రాలలో రైతులకు రక్షణ కల్పించామని తెలిపారు. గ్రామాలలోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, నకిలీ విత్తనాల వల్ల నష్టం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం నందు డిఎస్పి ప్రసన్నకుమార్, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, తుంగతుర్తి ఎస్సై క్రాంతికుమార్, నూతనకల్ ఎస్సై నాగరాజు, మద్దిరాల ఎస్సై వీరన్న, డిసిఆర్బి ఎస్ఐ యాకూబ్, ఆర్ఎస్ఐ అన్వర్, డి సి ఆర్ బి సిబ్బంది అంజన్ రెడ్డి శేఖర్ రెడ్డి, సిసి సందీప్, టెక్నికల్ టీం కానిస్టేబుల్ సుమన్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.










