Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం
Miryalaguda : వ్యవసాయ అధికారి హెచ్చరిక.. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం, మండలంలోని ఎరువుల దుకాణాలను మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి ఎం.ఋష్యేంద్రమణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

Miryalaguda : వ్యవసాయ అధికారి హెచ్చరిక.. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం, మండలంలోని ఎరువుల దుకాణాలను మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి ఎం.ఋష్యేంద్రమణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పట్టణంలోని శ్రీసాయి మహేశ్వర, సిద్ధివినాయక ఫర్టిలైజర్ దుకాణాలను సుమారు గంటసేపు తనిఖీ చేయడం జరిగింది. ఆయా దుకాణల క్రయవిక్రయ రిజిస్టర్లు, బిల్లు బుక్కులు, రికార్డులను పరిశీలించడం జరిగింది. ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించడం జరిగింది. స్టాక్ స్థితి, ధరల వివరాలు బోర్డుపై పెట్టాలని కోరినట్టు తెలిపారు. అధిక ధరలకు విక్రాయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.









