Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

ఢిల్లీలోని హోటల్లో అగ్ని ప్రమాదం.. 21 మంది మృతి..!

ఢిల్లీలోని మాలవియా నగర్ లో ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

ఢిల్లీలోని హోటల్లో అగ్ని ప్రమాదం.. 21 మంది మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఢిల్లీలోని మాలవియా నగర్ లో ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా రెస్టారెంట్ భవనంలో చిక్కుపోయిన 40 మందిని కూడా రక్షించారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ ఘటనపై సమాచారం అందిందని ఢిల్లీ పోలీసు పేర్కొన్నారు.

ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా 47 మందిని రక్షించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలను పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ భవనం బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఐదు అంతస్తులు ఉండగా వాటిలో మూడంతస్తులకు మంటలు వ్యాపించాయి.

ప్రాణాలను కాపాడుకునేందుకు కొంతమంది పై అంతస్తులో ఉన్న పలువురు కిటికీల నుంచి దూకినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చేరుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు