Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

TS News : జర్నలిస్టుల తరఫున కొట్లాడుతున్న ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయు).. రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ..! 

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వినాయక బ్యాంక్వెట్ హాలులో నల్గొండ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టుల జిల్లా మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. నల్గొండ జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జర్నలిస్టుల రాకతో పట్టణం సందడిగా మారింది.

TS News : జర్నలిస్టుల తరఫున కొట్లాడుతున్న ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయు).. రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ..! 

మరోసారి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గార్లపాటి కృష్ణారెడ్డి

నల్లగొండ, మనసాక్షి

​నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వినాయక బ్యాంక్వెట్ హాలులో నల్గొండ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టుల జిల్లా మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. నల్గొండ జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జర్నలిస్టుల రాకతో పట్టణం సందడిగా మారింది. మహాసభల ప్రారంభానికి ముందు నకిరేకల్ ప్రధాన కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి వేదిక వరకు జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించి,భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ,రాష్ట్ర కమిటీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడుతూ.. “నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. అలాంటి చైతన్యవంతమైన నకిరేకల్ గడ్డపై జర్నలిస్టుల మహాసభలు నిర్వహించడం గర్వకారణం” అని పేర్కొన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాలు,అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై నేతలు క్లుప్తంగా, ఘాటుగా చర్చించారు. ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సంక్షేమానికి భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బలమైన సంఘంగా చేస్తుందని, రాష్ట్రంలో ఇప్పటివరకు 14వేల సభ్యత్వాలు వచ్చాయని రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై 24 గంటలు పనిచేస్తున్నామని ఆయన అన్నారు.మహాసభల సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా గార్లపాటి కృష్ణారెడ్డి తిరిగి ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అలాగే చిన్న పత్రికల సంఘం, ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్ల సంఘం వివిధ నియోజకవర్గాల నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె.నాగయ్య,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సాంబశివారెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకు సతీష్, గౌరవాధ్యక్షులు రేపాల సతీష్, నియోజకవర్గ నాయకులు బయన్న, శీను, కందగట్ల శ్రీధర్, బుడిగ సైదులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు