Miryalaguda : హోరాహోరీగా జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడలు..!
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.

Miryalaguda : హోరాహోరీగా జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడలు..!
– నువ్వా..నేనా అన్నట్టుగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్
– ప్రథమ బహుమతి సాధించిన కల్లూరు క్రీడాకారులు
వేములపల్లి, మన సాక్షి:
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. గురువారం రాత్రి కల్లూరు వర్సెస్ సర్వారం టీముల వద్ద ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఫైనల్ మ్యాచ్లో కల్లూరు మొదటి బహుమతి సాధించగా.. సర్వారం ద్వితీయ బహుమతి సాధించింది.
కబడ్డీ క్రీడలు నువ్వా..నేనా అన్నట్టుగా సాగాయి. మూడో బహుమతి తడకమళ్ళ, నాలుగో బహుమతి ఆళ్లగడప, ఐదో బహుమతి మల్లారెడ్డిగూడెం, ఆరవ బహుమతి రావులపెంట కమిటీ టీం విజయం సాధించాయి. ఫైనల్ మ్యాచ్లో బెస్ట్ డిపెండెర్ గా నహీం (సర్వారం), బెస్ట్ రైడర్ గా వేణు (కల్లూరు) నిలిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన కబడ్డీ టీములకు దేవాలయ కమిటీ వారు అభినందనలు తెలిపారు.









