TS News : తెలంగాణలో ఉపసర్పంచ్ లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం..!
తెలంగాణ సర్కార్ ఉపసర్పంచ్ లకు భారీ షాక్ ఇచ్చింది. ఇక ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు కానున్నది. వారి చెక్ పవర్ ను రద్దు చేసి సర్పంచి, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ కల్పించనున్నది. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నది.

TS News : తెలంగాణలో ఉపసర్పంచ్ లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ సర్కార్ ఉపసర్పంచ్ లకు భారీ షాక్ ఇచ్చింది. ఇక ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు కానున్నది. వారి చెక్ పవర్ ను రద్దు చేసి సర్పంచి, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ కల్పించనున్నది. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నది.
ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుచేసి వారి స్థానంలో గ్రామ కార్యదర్శులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ సమావేశంలో త్వరలో నిర్ణయం తీసుకొనున్నారు. పరిపాలన లో పారదర్శకత కోసం ఒక ప్రజా ప్రతినిధి, ఒక అధికారి జవాబుదారీగా ఉండేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అందుకోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సర్పంచ్, గ్రామ కార్యదర్శిల సంతకాల తోనే చెక్ పాస్ అయ్యేలా సవరణ చేయనున్నారు. ఇతర శాఖలో నిధులు కావాలని అడుగుతుండగా పంచాయతీరాజ్ శాఖలో మాత్రం నిధులు ఖర్చు చేయడంపై జాప్యం జరుగుతుంది. ఈ విషయంపై ఆరా తీయగా ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ వల్ల ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంపై క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుని ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ తొలగించి వారి స్థానంలో కార్యదర్శి ఏర్పాటు చేయడమే మిగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
సర్పంచులకు కూడా చెక్ పవర్ రద్దు రాజకీయాలనే ప్రతిపాదన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యతితేకత వచ్చింది. ముఖ్యమంత్రికి, మంత్రికి లేని చక్ పవర్ కేవలం సర్పంచ్లకు మాత్రమే ఎందుకు అని చర్చ కూడా కొనసాగింది.
తెలంగాణ లో :
అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కి కూడా ఇచ్చింది. గ్రామ కార్యదర్శిని పక్కకు పెట్టారు. దీంతో గ్రామాలలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. పాలనా వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే బీఆర్ఎస్ హయంలో సర్పంచులు తమ గౌరవ వేతనాలు కూడా ఉప సర్పంచ్ సంతకాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ వైరాలతో బిల్లులు పాస్ కాకపోవడం, చెక్ లపై సంతకాలు జాప్యం కావడం, అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం ఇవన్నీ కొనసాగాయి. ఈ విషయం ఉన్నతాధికారులు గుర్తించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఎందుకని, రద్దు చేయాలని, ఇద్దరు ప్రజా ప్రతినిధులలో ఉప సర్పంచ్ కి రద్దు చేయాలని ప్రతిపాదించిన్నట్లు సమాచారం. కాగా . ఓకే చెప్పడంతో త్వరలో నిధులు ఖర్చుకు సంబంధించి పరిష్కారం దొరుకుతుందని అధికారులు పేర్కొంటున్నారు.









