Srisailam : శ్రీశైలం డ్యామ్ వద్ద 5కి.మీల భారీ ట్రాఫిక్..!
శ్రీశైలం డ్యామ్ వద్ద 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం జలాశయం మలుపు దగ్గర ఒక టూరిస్ట్ బస్సు బురదలో చిక్కుకొని నిలిచిపోయింది.

Srisailam : శ్రీశైలం డ్యామ్ వద్ద 5కి.మీల భారీ ట్రాఫిక్..!
మన సాక్షి :
శ్రీశైలం డ్యామ్ వద్ద 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం జలాశయం మలుపు దగ్గర ఒక టూరిస్ట్ బస్సు బురదలో చిక్కుకొని నిలిచిపోయింది.
దాంతో జలాశయం నుంచి అటువైపు దోమలపెంట చెక్ పోస్టు, ఇటువైపు సుండిపెంట వరకూ ట్రాఫిక్ జామ్ ఉంది. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి ఉంది.
ఇటీవల అక్కడ కురిసిన వర్షాల వల్ల కొంత బురద ఏర్పడింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర అన్నీ మలుపులు ఉంటాయి. తెలంగాణ, ఏపీ.. రెండువైపులా.. ఘాట్ రోడ్డు నుంచి.. మలుపుల ద్వారా.. డ్యామ్ దగ్గరకు వాహనాలు వస్తాయి. డ్యామ్ పక్క నుంచి.. వెళ్తూ.. నదిపై ఉన్న వంతెనను దాటుతాయి. ఈ క్రమంలో.. రోడ్డు చిన్నగా ఉండటం తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే.. రాత్రివరకూ పట్టే పరిస్థితులు ఉండగలవు. అందువల్ల శ్రీశైలం డ్యామ్ వైపుగా వెళ్లాలనుకునేవారు అప్రమత్తం అవ్వాలి.