Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : నేడు రైతుల సమస్యలపై టిఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం..!

రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం ఈనెల 11వ తేదీన నల్గొండలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సమన్వయకర్త జిల్లా ఇన్చార్జ్ పాడిగపాటి విక్రాంత్ రెడ్డి తెలిపారు.

Nalgonda : నేడు రైతుల సమస్యలపై టిఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం..!

నల్గొండ, మన సాక్షి :

రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం ఈనెల 11వ తేదీన నల్గొండలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సమన్వయకర్త జిల్లా ఇన్చార్జ్ పాడిగపాటి విక్రాంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు.

రైతుల ఆత్మహత్యలు, అప్పులు, రుణమాఫీ అమలు కాకపోవడం, కరెంటు కష్టాలు, మార్కెటింగ్ లో మోసాలు, రైతు భరోసా, కల్తి విత్తనాలు, ఎరువుల కొరతపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు దేరావత్ సరిత, వల్లంపల్లి సందీప్ కుమార్, కిషోర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు