Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం..! 

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో బీ ఎల్ ఆర్, ఎన్ వి ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నూకల చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన జిపిల్ -2 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేత జట్లకు ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ బహుమతులు అందజేశారు. 

Miryalaguda : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం..! 

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో బీ ఎల్ ఆర్, ఎన్ వి ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నూకల చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన జిపిల్ -2 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేత జట్లకు ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ స్థాయిలో యువత ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

యువత క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నూకల చారిటబుల్ ట్రస్ట్, బి ఎల్ ఆర్, ఎన్ వి ఆర్ బ్రదర్స్ సభ్యులను అభినందించారు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి, గోదాల జానకి రామ్ రెడ్డి, అశోక్ క్రీడాకారులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు