రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి
రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 15 రాష్ట్రాలలో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో 41 స్థానాలు ఎకగ్రీవం అయ్యాయి. కాగా నాలుగు రాష్ట్రాలలో మిగిలిన 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో ఈ ఎన్నికలు జరిగాయి. 16 స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా శివసేన, ఎన్ సి పి ఒక్కొక్క స్థానం గెలుపొందాయి. అదే విధంగా హర్యానాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
ఇది కూడా చదవండి :
1. వారిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే – latest news
2. రోడ్డు ప్రమాదంలో తండ్రి , కొడుకులు మృతి, తల్లికి తీవ్ర గాయాలు – latest news









