Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. జడ్పిలో ఆ ఉద్యోగి సస్పెండ్, ఉత్తర్వులు జారీ..! 

పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్ కె .మెయినోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

District Collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. జడ్పిలో ఆ ఉద్యోగి సస్పెండ్, ఉత్తర్వులు జారీ..! 

సూర్యాపేట, మనసాక్షి :

పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్ కె .మెయినోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గరిడేపల్లి మండలంలో పని చేస్తున్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువు కావడంతో మెయినోద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన పరిధిలోని పలువురు పంచాయతీ కార్యదర్శుల నుండి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మెయినోద్దీన్ చేసిన వసూళ్లపై ఎంక్వైరీ చేపట్టగా విచారణలో పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలతో సహా నిజాలు నిరూపితమయ్యాయి.

విచారణ నివేదిక ఆధారంగా సదరు సీనియర్ అసిస్టెంట్‌పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిని సహించేది లేదనే హెచ్చరికలతో ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఇలాంటి చర్యలే ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు