Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ తయారీ.. భార్యాభర్తలే చలామణి, మిర్యాలగూడలో రౌడీ షీటర్ కేసు..!

ఆర్థిక ఇబ్బందులతో పాటు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని ఆ భార్యాభర్తలు పథకం వేశారు. నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తే బాగుంటుందని పథకం వేశారు. యూట్యూబ్ లో నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని చూశారు.

Nalgonda : యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ తయారీ.. భార్యాభర్తలే చలామణి, మిర్యాలగూడలో రౌడీ షీటర్ కేసు..!

నల్గొండ, మన సాక్షి :

ఆర్థిక ఇబ్బందులతో పాటు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని ఆ భార్యాభర్తలు పథకం వేశారు. నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తే బాగుంటుందని పథకం వేశారు. యూట్యూబ్ లో నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని చూశారు. ప్రింటింగ్ పేపర్ తో పాటు ప్రింటర్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. నకిలీ 500 నోట్లను తయారు చేయడం ప్రారంభించి వారిద్దరే చలామణి చేస్తున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాలలో నోట్లు చాలా మంది చేస్తూ గడుపుతున్నారు.

పట్టుబడింది ఇలా..!

నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న భార్యాభర్తలు బెజవాడ రాజీవ్, అతడి భార్య దుర్గం పావనిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా చండూరు మండలం తస్కాని గూడెంకు చెందిన కిరణ్ చండూరు మండల కేంద్రంలో పాల కేంద్రం నిర్వహిస్తున్నారు. కాగా పాల కేంద్రంలో ఈనెల 12వ తేదీన రాజీవ్ అనే వ్యక్తి 500 రూపాయలు ఇచ్చి పాలు కొనుగోలు చేశారు. అయితే నిర్వాహకుడు కిరణ్ అది దొంగనోటుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కూపి లాగి నల్గొండలో ఇరువురి భార్యాభర్తలను అరెస్టు చేశారు.

మిర్యాలగూడలో రౌడీ షీటర్ కేసు :

నిందితుడు రాజు గతంలో పాత నేరస్థుడని, అతనిపై హత్య, హత్యయత్నం కేసులు కూడా ఉన్నట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు. అతనిపై మిర్యాలగూడలో రౌడీ షీటర్ కేసు కూడా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పలు నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్లుగా కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా వారి వద్ద నుంచి 15 500 రూపాయల నకిలీ నోట్లు, ప్రింటర్ కరెన్సీ పేపర్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చేదించిన చండూరు సిఐ శివకుమార్, ఎస్సై శ్రీరాములను అభినందించారు.

మరిన్ని వార్తలు