Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణ

ACB : ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం..!

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరిపై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ACB విస్తృత సోదాలు నిర్వహించింది.

ACB : ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరిపై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ACB విస్తృత సోదాలు నిర్వహించింది.
మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అధికారులు, నరహరి నివాసం, కార్యాలయం, బంధువులు మరియు సన్నిహితుల ఆస్తులను పరిశీలించారు.

ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోదాల్లో సుమారు రూ.32 లక్షల నగదు, పలు స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

నరహరి పేరుతో ఉన్న ఆస్తులు, పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలపై అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే కోణంలో ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరిన్ని అక్రమాస్తుల లావాదేవీలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు