Paddy : బోనస్ ఇచ్చేది ఆ ఏడు రకాల వరి విత్తనాలకు.. రైతు వేదికల్లో సబ్సిడీపై..!
తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యంకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తుంది.

Paddy : బోనస్ ఇచ్చేది ఆ ఏడు రకాల వరి విత్తనాలకు.. రైతు వేదికల్లో సబ్సిడీపై..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యంకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తుంది. కాగా రైతులు సన్నధాన్యం పేరుతో ఇతర వరి సాగు చేసి మోసపోకుండా ఉండేందుకు గాని ప్రభుత్వం బోనస్ అందించే సన్న రకాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా ప్రభుత్వం అందజేసే ఆ ఏడు రకాల వరి విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆ విత్తనాలకు సబ్సిడీ రూపంలో కూడా రైతులకు అందజేయాలని ఆదేశించారు.
సన్నధాన్యం పండించే రైతుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులతో పాటు పోలీస్ అధికారి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతుల్లో అసంతృప్తి తొలగేలా వానాకాలం రైతు భరోసాకు.. డేట్ ఫిక్స్..!
- Nalgonda : హృదయ విధారక ఘటన.. అతివేగం, నిర్లక్ష్యంతో ఎడ్ల బండిని ఢీ కొట్టిన కారు.. రెండు ఎడ్లు మృతి, రైతుకు గాయాలు..!
- Paddy : ఆ ఎనిమిది రకాల వరి వంగడాలకే డిమాండ్.. రైతులు వాటినే సాగు చేయాలి..!
- Miryalaguda : రైస్ మిల్లర్ల సంచలన ప్రకటన.. ముందే చెప్తున్నాం, ఆ ధాన్యం కొనుగోలు చేయం..!









