Mutton Curry : స్టార్ హోటల్ స్టైల్ లో మటన్ కర్రీ టేస్టీగా ఉండాలంటే.. ఇలా చేయాలి.. సింపుల్ సీక్రెట్..!
మటన్ కర్రీ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కానీ అది ఉండే విధానంలో తేడా ఉండడం వల్ల టేస్ట్ లో మార్పులు వస్తాయి. అలా కాకుండా మనకు స్టార్ హోటల్ లో మటన్ కర్రీ టేస్ట్ ఉండేవిదంగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

Mutton Curry : స్టార్ హోటల్ స్టైల్ లో మటన్ కర్రీ టేస్టీగా ఉండాలంటే.. ఇలా చేయాలి.. సింపుల్ సీక్రెట్..!
మన సాక్షి, ఫీచర్స్ డెస్క్ :
మటన్ కర్రీ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కానీ అది ఉండే విధానంలో తేడా ఉండడం వల్ల టేస్ట్ లో మార్పులు వస్తాయి. అలా కాకుండా మనకు స్టార్ హోటల్ లో మటన్ కర్రీ టేస్ట్ ఉండేవిదంగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.. స్టార్ హోటల్ స్టైల్‌లో మెత్తగా, జ్యూసీగా, రుచిగా ఉండే మటన్ కర్రీ ఇలా చేయండి.
కావాల్సిన పదార్థాలు :
- మటన్ – 1 కిలో (మధ్యస్థ ముక్కలు)
- ఉల్లిపాయలు – 4 (సన్నగా తరిగినవి)
- టమాటాలు – 3
- పెరుగు – ½ కప్పు
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి – 4
- కారం – 2 టేబుల్ స్పూన్లు
- ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు
- పసుపు – ½ టీ స్పూన్
- గరం మసాలా – 1 టీ స్పూన్
- ఉప్పు – తగినంత
- కొత్తిమీర, పుదీనా – కొద్దిగా
- నూనె – 100–120 మి.లీ.
- మొత్తం మసాలాలు
బిర్యానీ ఆకు – 2 - దాల్చిన చెక్క – 2 ముక్కలు
- లవంగాలు – 5
- యాలకులు – 4
- షాజీరా – 1 టీ స్పూన్
1వ దశ – మెరినేట్ చేయండి :
మటన్‌లో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్,
పసుపు కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి కనీసం 2 గంటలు (ఫ్రిజ్‌లో అయితే 6–8 గంటలు) ఉంచండి.
2వ దశ – కర్రీ తయారీ :
కుక్కర్‌లో నూనె వేడి చేసి మొత్తం మసాలాలు వేయండి. ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చే వరకు వేయించండి. అల్లం- వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపండి. మెరినేట్ చేసిన మటన్ వేసి 10–15 నిమిషాలు బాగా వేయించండి. అవసరమైనంత వేడి నీరు పోసి కుక్కర్ మూత పెట్టండి.
3వ దశ – ఉడికించడం :
లేత మటన్ అయితే 5–6 విజిల్స్ గట్టి మటన్ అయితే 8–10 విజిల్స్
4వ దశ – ఫినిషింగ్ :
మూత తీసి గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించండి.
స్టార్ హోటల్ సీక్రెట్స్:
మటన్‌ను ముందుగా బాగా మెరినేట్ చేయడం. ఉల్లిపాయలను బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించడం. ఎక్కువ మంటపై కాకుండా నెమ్మదిగా ఉడికించడం.
చివర్లో కొద్దిగా నెయ్యి వేసి 5 నిమిషాలు మూతపెట్టి ఉంచితే అద్భుతమైన వాసన, రుచి వస్తాయి. ఈ విధంగా చేస్తే ఇంట్లోనే స్టార్ హోటల్ స్టైల్ మటన్ కర్రీ రుచి వస్తుంది.











