Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా

మునగాలలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈటెల పూజలు

మునగాలలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈటెల పూజలు

మునగాల,  మనసాక్షి : సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునగాల ముదిరాజ్ సంఘం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వానం మేరకు విచ్చేసి పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించాలని, గ్రామ ప్రజలు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. గ్రామ సర్పంచ్ ఉపేందర్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, వేట సైదారావు, చింతకాయల నాగరాజు రమేషు చింతకాయల శ్రీనివాస్, కంటు శ్రీను, చీకటి శ్రీనివాస్, వేట శివాజీ ఆల్లి పాపారావు కిరణ్ కోదాడ మునగాల బిజెపి పార్టీ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

1. మిర్యాలగూడ అభివృద్ధికి ప్రణాళికలు – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

2. సమస్యల వడిలో…సర్కారు బడి, పున:ప్రారంభమైన పాఠశాలలు

3. పవిత్రసంగమంలో.. అపరిశుభ్రత, పట్టించుకునే నాథుడే కరువు

మరిన్ని వార్తలు