Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsక్రైంమహబూబాబాద్ జిల్లా

పోలీసుల అష్టదిగ్బంధం.. నల్లబెల్లం, పట్టిక, గుడుంబా స్వాధీనం..! 

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని మంగోలీగూడెం గ్రామంలో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, తొర్రూర్ డీఎస్పీ పర్యవేక్షణలో, సీఐ పవన్ చిన్నగూడూరు ఎస్‌ఐ కుశకుమార్ ఆధ్వర్యంలో మంగోలీగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, క్యూఆర్టీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

పోలీసుల అష్టదిగ్బంధం.. నల్లబెల్లం, పట్టిక, గుడుంబా స్వాధీనం..! 

చిన్న గూడూరు, మన సాక్షి:

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని మంగోలీగూడెం గ్రామంలో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, తొర్రూర్ డీఎస్పీ పర్యవేక్షణలో, సీఐ పవన్ చిన్నగూడూరు ఎస్‌ఐ కుశకుమార్ ఆధ్వర్యంలో మంగోలీగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, క్యూఆర్టీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు 250 ఇళ్లను తనిఖీ చేసి అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం, గుడుంబా, పటికను స్వాధీనం చేసుకోగా, గుడుంబా తయారీకి వినియోగిస్తున్న సుమారు 3 వేల లీటర్ల నల్లబెల్లం ఊటను ధ్వంసం చేశారు.

అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో రహదారి భద్రత, హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా, మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాల నిషేధంపై అవగాహన కల్పించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో మరిపెడ, సీరోల్ ఎస్‌ఐలు, సర్కిల్ పోలీసు సిబ్బంది, క్యూఆర్టీ బలగాలతో కలిపి 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు