Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్నగర్
గుర్తుతెలియని మృతదేహం బావిలో లభ్యం..!
పాలమూరు జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది.

గుర్తుతెలియని మృతదేహం బావిలో లభ్యం..!
మన సాక్షి, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
పాలమూరు జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక జమ్మలమ్మ టెంపుల్ పక్కనే ఉన్న బావిలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న ఓ గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యమయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ మార్చురీకి తరలించారు.









