Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

కారు, ఆటో ఢీకొని మహిళ మృతి.. ఇద్దరికి గాయాలు..!

నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామం శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

కారు, ఆటో ఢీకొని మహిళ మృతి.. ఇద్దరికి గాయాలు..!

మహబూబ్ నగర్ జిల్లా
( మన సాక్షి ప్రతినిధి)

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామం శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ,ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు.. గొల్ల సరిత (36), మరో మహిళ మంగలి పూజిత, ఆటో డ్రైవర్ ఇద్రీస్ ఉన్నారు.

అక్టోబర్ 7 రాత్రి 8 గంటలకు సరిత, పూజిత ఇద్దరూ మహబూబ్ నగర్ నుండి ఆటో (AP 22 Y 8243) లో కాకర్లపహాడ్ కు వస్తున్నారు. ఆటోను ఇద్రీస్ నడుపుతూ
రాత్రి 8:40 గంటలకు మైసమ్మ గుడి దాటిన తర్వాత మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చిన కారు నెం. TG 38A 5857 అతి వేగంగా, వచ్చి ఆటోను
ఢీకొనింది.

కారు ఢీకొన్న వేగానికి సరిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది, మరో మహిళకు పూజితకు మూగ దెబ్బలు, డ్రైవర్ ఇమ్రాన్ కు గాయాలు కాగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 108 ద్వారా క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గురువారం కారు నడుపుతున్న డ్రైవర్ శరత్, మహబూబ్ నగర్ వాసిగా గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య మరణానికి కారణమైన కారు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని గొల్ల మాధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్సై నరేందర్ తెలిపారు.

మరిన్ని వార్తలు