Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

విద్యుత్ కేంద్రానికి భూమి పూజ చేసిన మంత్రి వివేక్..!

మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో 33.11. కె.వి విద్యుత్ కేంద్రాన్ని బుధవారం చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక ఉపాధి కల్పన శాఖ మాత్యులు గడ్డం వివేక్వెంకటస్వామి భూమి పూజ నిర్వహించారు.

విద్యుత్ కేంద్రానికి భూమి పూజ చేసిన మంత్రి వివేక్..!

మందమర్రి, మనసాక్షి :

మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో 33.11. కె.వి విద్యుత్ కేంద్రాన్ని బుధవారం చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక ఉపాధి కల్పన శాఖ మాత్యులు గడ్డం వివేక్వెంకటస్వామి భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామా లకు మంచిర్యాల కేంద్రం నుండి విద్యుత్ సరఫరా చేయడం వల్ల నిరంతర విద్యుత్ అంతరాయం కలుగుతున్న కారణంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 33.11 కె.వి విద్యుత్ కేంద్రాన్నివెంకటాపూర్ గ్రామానికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

విద్యుత్ కేంద్ర నిర్మాణానికి గాను తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం 2. 90 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే అర్హులైన వారికి అర్హత పత్రాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

Also Read : BREAKING NEWS : బంగారం వ్యాపారి అదృశ్యం, పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి.. ఓకే క్లిక్ తో మనసాక్షి బ్రేకింగ్ న్యూస్..! 

ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సతీష్ కుమార్ శర్మ.మండల ప్రజాపరిషత్ అధికారి రాజేశ్వర్. విద్యుత్ అధికారులు గ్రామ సర్పంచులు సెగ్యమ్ వెంకటేష్. పెంచాల మధు పున్నం. శ్రీలత తిరుపతి బచ్చలి రాములు.పెరుమల్ల వెంకటేష్. సుంకరి దివ్య సతీష్. పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కడారి జీవన్.

ఉపాధ్యక్షులు మాసు సంతోష్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేల్పుల శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్ వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమ అనంతరం ఇటీవల మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరు కుటుంబాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలు వేసి వారిఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు

మరిన్ని వార్తలు