Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
బేగంపేటలో నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి కలకలం..!
హైదరాబాదులోని బేగంపేట్ పరేడ్ గ్రౌండ్లోకి ఫ్లయింగ్ ఆఫీసర్ డ్రెస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవేశించాడు. ఆ యువకుడిని మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

బేగంపేటలో నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి కలకలం..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాదులోని బేగంపేట్ పరేడ్ గ్రౌండ్లోకి ఫ్లయింగ్ ఆఫీసర్ డ్రెస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవేశించాడు. ఆ యువకుడిని మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలు దిగుతూ సంచరిస్తుండగా అధికారులకు అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేశారు. అతడు నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారిగా గుర్తించినట్లు సమాచారం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ లోని నివాసముంటున్న నితీష్ కుమార్ పాల్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తాను ఎయిర్ ఫోర్స్ అధికారిని అంటూ ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ నిర్వహిస్తూ అదే పేరుతో యువతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని బేగంపేట పోలీసులకు మిలటరీ అధికారులు అప్పగించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









