Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంటెక్నాలజీ

WhatsApp : వాట్సాప్ ఇక నుంచి ఫ్రీ కాదు.. నెలకు రూ. 79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసుకుందాం..!

వాట్సప్ ప్లస్ పేరిట భారత్ లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చింది. దానికి నెలకు యూజర్లు 79 రూపాయలు చెల్లించాలి. అయితే మరి సాధారణ యూజర్ల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం..

WhatsApp : వాట్సాప్ ఇక నుంచి ఫ్రీ కాదు.. నెలకు రూ. 79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసుకుందాం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

వాట్సప్ ప్లస్ పేరిట భారత్ లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చింది. దానికి నెలకు యూజర్లు 79 రూపాయలు చెల్లించాలి. అయితే మరి సాధారణ యూజర్ల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో వాట్సప్ కూడా ఒక భాగమైంది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు కూడా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ ను స్మార్ట్ ఫోన్ యూజర్లు ప్రస్తుతం ఫ్రీగానే వినియోగిస్తున్నారు.

అయితే ఇకపై ఇప్పటివరకు ఫ్రీగా వాడుకున్న వాట్సప్ యాప్ ఇకపై డబ్బులు చెల్లించే రోజులు కూడా వచ్చేశాయి. అయితే వాట్సాప్ చరిత్రలోనే మొదటిసారిగా వాట్సాప్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ భారత్లో ప్రారంభించారు. దాని పేరు వాట్సాప్ ప్లస్ ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఇద్దరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అందుకోసం నెలకు 79 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకునే వారికి మొదటి నెల ట్రయల్ కోసం పూర్తిగా ఉచితంగా అందించనున్నది. అయితే వాట్సప్ యూసర్లు ఇప్పటివరకు ఫ్రీగా వినియోగించుకొని ఇప్పుడు నెలకు 79 రూపాయలు చెల్లించాలి అనగానే కంగారు పడుతున్నారు. అయితే వారికి కూడా గుడ్ న్యూస్ ఉంది.

వాట్సప్ ప్లస్ యూజర్లు మాత్రమే 79 రూపాయలు చెల్లించాల్సి ఉంది. రెగ్యులర్ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాట్సప్ పూర్తిగా పెయిడ్ యాప్ గా మారడం లేదు. కేవలం వాట్సాప్ ప్లస్ మాత్రమే పెయిడ్ యాప్ గా మారింది. మెసేజింగ్, వాయిస్ అండ్ వీడియో కాలింగ్, స్టేటస్ అప్డేట్స్, అండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ లాంటి మోషన్ ఫీచర్లు ఎప్పటి లాగానే పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి ఉంటాయి. వీటికి ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ప్లస్ వారికి అదనపు ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ పెయిడ్ సబ్రిప్షన్ తీసుకోవచ్చును.

పెయిడ్ సబ్స్క్రిప్షన్ లో ఏమిస్తున్నారు :

పెయిడ్ సబ్రిప్షన్ లో ఏమిస్తున్నారు అంటే.. ఈ యాప్ పూర్తిగా లుక్ అండ్ ఫీల్ లో మార్చేసే కష్టమైజేషన్ ప్యాక్. అందులో భాగంగా యూజర్లకు 18 కొత్త కలర్ థీమ్స్ లభిస్తాయి. యాప్ స్టైల్ మార్చుకోవచ్చును. 14 కొత్త యాప్ ఐకాన్ డిజైన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా సాధారణ యూజర్లకు దొరకని కొన్ని ఎక్స్క్లూజివ్ రింగ్ టోన్లు, స్టిక్కర్ ప్యాక్ లు అందుతాయి. వాటితో పాటు సూపర్ అప్డేట్ ఏంటంటే కేవలం మూడు చాట్ లు మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త వాట్సాప్ ప్లస్ లో 20 చాట్స్ వరకు కూడా పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి :

వాట్సాప్ లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ముందుగా మీ ఫోన్లోని వాట్సాప్ లో ఓపెన్ చేసి సెట్టింగ్స్ వెళ్ళండి. అక్కడ సబ్స్క్రిప్షన్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ ప్లస్ ఆప్షన్ కనిపిస్తే దానిని టాప్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి . పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అన్ని ఫోన్లకు అందుబాటులో రాలేదు ఫోన్ సెట్టింగ్స్ లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కనిపించకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు