Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

Power Cut : రేపు కరీంనగర్ రూరల్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. వేళలు ఇవే..!

కరీంనగర్ రూరల్ పరిధిలోని పలు ప్రాంతాలలో నేడు మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ గడం రఘు ఒక ప్రకటనలో తెలిపారు.

Power Cut : రేపు కరీంనగర్ రూరల్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. వేళలు ఇవే..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ రూరల్ పరిధిలోని పలు ప్రాంతాలలో నేడు మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ గడం రఘు ఒక ప్రకటనలో తెలిపారు. శాతవాహన కాలనీలో డిటిఆర్ ఏర్పాటు, లైన్ మరమ్మతు పనుల కారణంగా ఈ కోత విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యుత్ నిలిపివేత ప్రాంతాలు..ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు గంటల వరకు రేకుర్తి పాతవాడ, కొత్తవాడ, హనుమాన్‌నగర్ సాలెహ్ నగర్, వి. పార్క్ వెనుక భాగం మధ్యాహ్నం 02 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సమ్మక్క గద్దెలు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని సమ్మక్క గద్దెలు, ఐ హాస్పిటల్ (కంటి ఆసుపత్రి) ప్రాంతం ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ షేకాభి కాలనీ లలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి, మరమ్మతు పనుల కొరకు చేపడుతున్న ఈ విద్యుత్ సరఫరా అంతరాయానికి వినియోగదారులు సిబ్బందితో సహకరించాలని రూరల్ ఏడీఈ రఘు కోరారు.

మరిన్ని వార్తలు