Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి
Shankarpall : జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో కిలక మలుపు.. ముగ్గురు రిమాండ్..!
శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో ఆదివారం దంపతుల ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు.

Shankarpall : జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో కిలక మలుపు.. ముగ్గురు రిమాండ్..!
శంకర్పల్లి: (మన సాక్షి):
శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో ఆదివారం దంపతుల ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు. మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలి తల్లిదండ్రులు సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని జూల్కల్ గ్రామానికి చెందిన శాంతమ్మ, చంద్రయ్యతో పాటు మరిది వెంకటేష్ కలిసి తమ ఇంట్లో నిధి ఉందంటూ మృతుడు సాయి వద్ద రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా వేధించడంతోనే మనస్తాపంతో దంపతులు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.









