కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా బహుకరణ..!
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అద్భుత నైపుణ్యాన్ని మరోసారి చాటుతూ, అగ్గిపెట్టెలో ఇమిడేంత సూక్ష్మంగా నేసిన పట్టు శాలువాను భక్తిపూర్వకంగా సమర్పించారు.

కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా బహుకరణ..!
జగిత్యాల, మన సాక్షి:
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అద్భుత నైపుణ్యాన్ని మరోసారి చాటుతూ, అగ్గిపెట్టెలో ఇమిడేంత సూక్ష్మంగా నేసిన పట్టు శాలువాను భక్తిపూర్వకంగా సమర్పించారు. చేనేత కళకు ప్రతీకగా నిలిచిన హరిప్రసాద్, అత్యంత సన్నని దారాలతో ఎంతో శ్రమించి రూపొందించిన ఈ ప్రత్యేక పట్టు శాలువా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోయే ఈ శాలువా ఆయన కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.కొండగట్టు ఆలయానికి చేరుకున్న హరిప్రసాద్, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ అరుదైన శాలువాను ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే ఈ కళాఖండాన్ని రూపొందించి స్వామివారికి సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సూపర్డెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









