Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణ

Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర కలకలం.. 20 మంది మహిళల అరెస్ట్..!

హైదరాబాద్ లోనే శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తీవ్ర కలకలం కలిగింది. భారీ వీసా మోసం వెలుగు చూసింది.

Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర కలకలం.. 20 మంది మహిళల అరెస్ట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

హైదరాబాద్ లోనే శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తీవ్ర కలకలం కలిగింది. భారీ వీసా మోసం వెలుగు చూసింది. నకిలీ విసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు.

పోలీసుల సమాచారం మేరకు.. ఆ మహిళలంతా ఒమన్ ఎయిర్వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తనిఖీలు నిర్వహిస్తుండగా వారు సమర్పించిన వీసాలు నకిలీ ఆని అధికారులు గుర్తించారు. దాంతో ఇమిగ్రేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రైమ్ అవుట్ పోస్టు పోలీసులకు అప్పగించారు.

ఏజెంట్ చేతిలో మోసపోయామంటూ ఆవేదన :

పోలీసుల విచారణలో బాధితులు కన్నీరు మున్నీరైనట్లు సమాచారం. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్ ని ఆశ్రయించామని అసలు వీసాలు ఆని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని, నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశాడని మహిళలు పేర్కొన్నారు. తమకు ఎలాంటి తప్పు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళలను మోసం చేసిన ఏజెంట్ ఎవరనే కోణంలో విచారణ జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు