Suryapet : డాక్టరెట్ పొందిన ముత్యం రాజు కు జిల్లా కలెక్టర్ సన్మానం..!
ఇటీవల డాక్టరేట్ పొందిన ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యం రాజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ను మర్యాద పూర్వకంగా కలిసి డాక్టరేట్ పట్టాను కలెక్టర్ కు చూపించారు.

Suryapet : డాక్టరెట్ పొందిన ముత్యం రాజు కు జిల్లా కలెక్టర్ సన్మానం..!
సూర్యాపేట, మనసాక్షి :
ఇటీవల డాక్టరేట్ పొందిన ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యం రాజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ను మర్యాద పూర్వకంగా కలిసి డాక్టరేట్ పట్టాను కలెక్టర్ కు చూపించారు. కాసరాబాద్ గ్రామం లో ఆయిల్ పామ్ తోటల సందర్శించి నా సందర్బంగా కలెక్టర్ ను కలిశారు.ఈ సందర్బంగా కలెక్టర్ ముత్యం రాజు గురుస్వామి కి శాలువా తో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఉద్యాన వనం, ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగం లో డాక్టరేట్ పొందడం అభినందనీయమన్నారు.
ఉద్యాన శాఖ ద్వారా రైతులకు సలహాలు అందిస్తూ నూతన పంటలు సాగు చేసేలా కృషి చేయాలనీ సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు సేవా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లాఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య, సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్య , మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ప్రాంతీయ ఉద్యాన అధికారిని కట్ట స్వాతి, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ అలీమ్ తో పాటు పలువురు అధికారులు రైతులు ఉన్నారు.









