Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి..!
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆర్ ఎం పి డాక్టర్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. నల్గొండ మండలం దొనకల్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ పులేందర్ (59) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Nalgonda : నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆర్ ఎం పి డాక్టర్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. నల్గొండ మండలం దొనకల్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ పులేందర్ (59) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుండ్లపల్లి కోళ్ల ఫారం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిందా..? లేక బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో ప్రమాదం జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









