Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

TG News : తెలంగాణ లో ఈ నెల 10న విద్యాసంస్థల బంద్..!

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 10 తేదీన జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ లు కోరారు.

TG News : తెలంగాణ లో ఈ నెల 10న విద్యాసంస్థల బంద్..!

సూర్యాపేట, మనసాక్షి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 10 తేదీన జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ లు కోరారు.

వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వరంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, విద్యాశాఖ కి ఇప్పటివరకు మంత్రిని కేటాయించలేదని అన్నారు., 24 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదింపు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలలో విద్య వ్యాపారాన్ని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.,

పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 9000 వేల కోట్లను విడుదల చేయాలని, అంతే భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు హాస్టల్స్ మరియు గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో యూనిఫామ్స్ మరియు పుస్తకాలు ఇవ్వాలని, ప్రవేట్ విద్యాసంస్థలలో పుస్తకాలు యూనిఫార్మ్ నోటుబుక్ ల విక్రయాల కేంద్రాలను మూసివేయాలన్నారు.

ఈనెల 10న జరిగే విద్యాసంస్థల బందుకు విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు ప్రవీణ్, శశి, మహేష్, నవీన్, పవన్ ,వినయ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు