సంతోష్ బాబు విగ్రహాన్నిఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి
దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగం చిరస్మరణీయం
సూర్యాపేట రూరల్: దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుదవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండవ వర్ధంతి సంద్భంగా మంత్రి ఘన నివాలులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి కాసరబాద్ రోడ్డు లో ని స్మృతి వనం లొ కుటుంభ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని కుటుంభ సభ్యులు, ప్రజప్రతినిదులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు జాతి ఉన్నంత కాలం ప్రజల మనసులో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారన్నారు. అటువంటి మహనీయుడు ప్రాణ త్యాగం చేసింది మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రశంసిం చారు. కార్యక్రమం లొ కల్నల్ సంతోష్ కుటుంభ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, జడ్పీటిసి జీడి బిక్షం, రాష్ట్ర టీ.అర్. ఎస్ కార్యదర్శి వై.వీ, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ, పట్టణ ప్రమఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
1. దేశంలోనే పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
2. పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు ఉల్లంఘిస్తే, ఫిర్యాదు చేస్తే సరి









