Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda Tourists : విశాఖ బీచ్ లో నల్గొండ పర్యాటకులను కాపాడిన లైఫ్ గార్డ్.. తప్పిన ప్రాణ గండం..!

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో బీచ్ లో నల్గొండ పర్యాటకులకు ప్రాణగండం తప్పింది. లైఫ్ గార్డు సకాలంలో స్పందించడంతో బీచ్ లో కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా కాపాడారు.

Nalgonda Tourists : విశాఖ బీచ్ లో నల్గొండ పర్యాటకులను కాపాడిన లైఫ్ గార్డ్.. తప్పిన ప్రాణ గండం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో బీచ్ లో నల్గొండ పర్యాటకులకు ప్రాణగండం తప్పింది. లైఫ్ గార్డు సకాలంలో స్పందించడంతో బీచ్ లో కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా కాపాడారు.

వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఆర్కే బీచ్ లో నల్గొండకు చెందిన ఐదుగురు పర్యాటకులకు తృటిలో ప్రాణ గండం తప్పింది. లైఫ్ గార్డులు సకాలంలో స్పందించి కొట్టుక పోతున్న వారిని కాపాడారు.

నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన స్నేహితులు బుధవారం విశాఖ ఆర్కే సముద్రతీరంలో స్నానం చేస్తుండగా భారీ అలలతో కొట్టుకుపోయారు. గమనించిన సిఎంసి లైఫ్ కార్డు ధనరాజ్ తో పాటు మరికొందరు సకాలంలో స్పందించి కాపాడారు. దాంతో నల్లగొండ పర్యాటకులకు ప్రాణగండం తప్పింది. లైఫ్ గార్డుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు