Suryapet : ల్యాండ్ చీటింగ్ కేసులో నిందితుడు అరెస్ట్..!
చివ్వెంల మండలంలోని అయిలాపురం గ్రామ శివారులో ఉన్న భూమిని ప్లాట్లుగా విక్రయిస్తానని చెప్పి, ఇతరుల భూమిని తనదిగా నమ్మబలికి కోడదల వెంకన్న, కోడదల కనకయ్యల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన కాసర్ల సురేందర్ రెడ్డి, అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితుడు కోడదల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

Suryapet : ల్యాండ్ చీటింగ్ కేసులో నిందితుడు అరెస్ట్..!
చివ్వెంల, మనసాక్షి :
చివ్వెంల మండలంలోని అయిలాపురం గ్రామ శివారులో ఉన్న భూమిని ప్లాట్లుగా విక్రయిస్తానని చెప్పి, ఇతరుల భూమిని తనదిగా నమ్మబలికి కోడదల వెంకన్న, కోడదల కనకయ్యల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన కాసర్ల సురేందర్ రెడ్డి, అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితుడు కోడదల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.
కేసు దర్యాప్తును చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ చేపట్టగా, విచారణలో సంబంధిత భూమి కాసర్ల సురేందర్ రెడ్డికి చెందినది కాదని, ఇతరుల భూమిని తనదిగా చూపించి బాధితులను మరియు ఇతరులను కూడా మోసం చేసినట్లు తెల్సింది. భాదితులు ఎవరైనా ఉంటే పోలీస్ ల ను ఆశ్రయించగలరు
దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు నిందితుడు కాసర్ల సురేందర్ రెడ్డి ని గురువారం సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. రాజశేఖర్ అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
భూముల కొనుగోలు, విక్రయాల సందర్భంగా సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, యాజమాన్య హక్కులను రెవెన్యూ అధికారుల ద్వారా ధృవీకరించుకున్న అనంతరమే లావాదేవీలు నిర్వహించాలని పోలీసులు ప్రజలకు సూచించారు