Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ పర్సనల్ సెక్రెటరీగా శివ వాత్సల్య..!

శ్రీకాంతాచారి త్యాగాన్ని స్మరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం పట్ల గర్వంగా ఉన్నదని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ యాచారం శివ వాత్సల్య అన్నారు.

తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ పర్సనల్ సెక్రెటరీగా శివ వాత్సల్య..!

చింతపల్లి, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. శ్రీకాంతాచారి త్యాగాన్ని స్మరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం పట్ల గర్వంగా ఉన్నదని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ యాచారం శివ వాత్సల్య అన్నారు.

చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామానికి చెందిన యాచారం శివ వాత్సల్య శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ తాను శంకరమ్మ పిఎస్ గా చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. మహిళల సమస్యలు ఏవైనా ఉంటే శంకరమ్మ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతపల్లి మండలంలో సామాజిక సేవలు నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆ ఫౌండేషన్ చైర్మన్ శివ వాత్సల్య పేర్కొన్నారు..

మరిన్ని వార్తలు