Miryalaguda : తెలంగాణలో భూముల రీ-సర్వే.. పైలెట్ ప్రాజెక్ట్ లో ఎంపికైన గ్రామాల్లో అవగాహన..!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రలో భూముల రీ-సర్వే చేపట్టనున్నది. అందులో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారు.

Miryalaguda : తెలంగాణలో భూముల రీ-సర్వే.. పైలెట్ ప్రాజెక్ట్ లో ఎంపికైన గ్రామాల్లో అవగాహన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రలో భూముల రీ-సర్వే చేపట్టనున్నది. అందులో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారు. కాగా భూముల రీ సర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు
పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంపికైన గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. భూముల రీ సర్వే కు నియోజకవర్గం లో
అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం, దామరచర్ల మండలం నర్సాపురం, మిర్యాలగూడ మండలం కిష్టాపురం, వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం, మాడ్గులపల్లి మండలం గండ్రవారి గూడెం గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది.
శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్డీవో రమణారెడ్డి పాల్గొన్నారు. భూముల రీ-సర్వే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించబడటంతో పాటు భూ రికార్డులు ఆధునికీకరించబడతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతులు, భూ యజమానులు రీ-సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని, అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు అవసరమైన పత్రాలు అందించి ఖచ్చితమైన వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రజల భూ హక్కులను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు వివాదరహిత భూ రికార్డులు అందించడం తెలంగాణ ప్రభుత్వ పేర్కొన్నారు.











