రైతులకు వ్యవసాయ అధికారి కీలక సూచన.. ప్రత్యామ్నాయ పంటల సాగు శ్రేయస్కరం..!
ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి సూచించారు.

రైతులకు వ్యవసాయ అధికారి కీలక సూచన.. ప్రత్యామ్నాయ పంటల సాగు శ్రేయస్కరం..!
గుర్రంపోడు,మన సాక్షి :
ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తానేదారిపల్లి రైతు వేదిక నందు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసినప్పటికీ చెరువులు పూర్తిస్థాయిలో నిండడం కష్టమని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు పొలం మొత్తం వరి సాగు చేస్తే, పంట ఆఖరి దశలో నీరు అందక పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రైతులు సాంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే జొన్న, పెసలు, మినుములు, కంది, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు, ప్రస్తుత మార్కెట్లో మంచి లాభాలు కూడా పొందవచ్చునని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు మనోజ్ కుమార్, ధరణి, గ్రామ సర్పంచ్ కంచర్ల యాదమ్మ మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









