Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Cotton : పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు.. ఎలా చేపట్టాలో తెలుసుకుందాం..! 

పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేతేపల్లి మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం తెలిపారు.

Cotton : పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు.. ఎలా చేపట్టాలో తెలుసుకుందాం..! 

కేతేపల్లి, మనసాక్షి.

పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేతేపల్లి మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం తెలిపారు.
కేతేపల్లి మండలం లోని కొర్లపాడు, బండపాలెం, ఇనుపాముల గ్రామాలలో ప్రస్తుత వానాకాలం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి, పొలాలను ఆయన బుధవారం సందర్శించి, పత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎల్ నీనో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి రైతులకు పలు సూచనలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ

ప్రస్తుతం పత్తి పంట విత్తనాలు వేసి 30-45 రోజుల దశలో ఉంది.పత్తి పంటలో గడ్డి మరియు వెడల్పటి ఆకులు గల కలుపును గుర్తించటం జరిగిందని , కలుపు నివారణకు అంతర కృషి చేయటానికి అనుకూలంగా ఉన్నదని ఆయన తెలిపారు . ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి క్విజాలోఫోస్ -ఇ -ఇథైల్ 400 ఎంల్ l, 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని ఆయన వివరించారు. వెడల్పటి ఆకు సమస్య అధికంగా ఉన్నాయెడల ఎకరాకు పైరితాయో బ్యాక్ సోడియం 250 ఎంల్ ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలని ఆయన తెలిపారు.

రైతులు సిఫారసు చేసిన నత్రజని, పోటాష్ ఎరువులు నాలుగు సమ భాగాలుగా చేసి విత్తిన 20,40,60,80 రోజులకు వేయాలని ఆయన రైతులకు సూచించారు. ప్రత్తిలో రసం పీల్చు పురుగుల నివారణకు ఏసీ్ఫేట్ 1.5గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఏసీటమీప్రిడ్ 0.2 గ్రా. లేదా థయోమిథ గ్జామ్ 0.2 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ. లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని, బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయని, అందువల్ల రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి నాట్లు వేసుకోవలసినదిగా ఆయన తెలిపారు .

నీటి వసతి తక్కువగా ఉన్నవారు వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల పంటలైన కంది, జొన్న, పెసలు, మినుములు, ఆముదం పంటలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసి భూసారాన్ని సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బండపాలెం సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస రావు, వ్యవసాయ విస్తరణ అధికారి నాగరాజు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు