Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : కేపీహెచ్‌బీలో గంజాయి విక్రయాలు.. నెల్లూరు యువకుడి అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన చెందిన ఓ యువకుడు నగరంలోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad : కేపీహెచ్‌బీలో గంజాయి విక్రయాలు.. నెల్లూరు యువకుడి అరెస్ట్..!

కూకట్పల్లి, మన సాక్షి.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన చెందిన ఓ యువకుడు నగరంలోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పక్కా సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో ఈ విజయాన్ని సాధించారు. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన సి. అఖిల్ బాబు కేపీహెచ్‌బీ పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక బృందంతో దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 470 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరికి విక్రయిస్తున్నాడు,

ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బాలానగర్ ఎక్సైజ్ అధికారి హన్మంతరావు మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాల విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే ఎక్సైజ్ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు మరింత ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు