Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా వాసులు మృతి..!

తిరుపతి దేవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా వాసులు మృతి చెందారు. మృతుల్లో రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది.

Nalgonda : తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా వాసులు మృతి..!

చింతపల్లి., మనసాక్షి. :

తిరుపతి దేవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా వాసులు మృతి చెందారు. మృతుల్లో రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. వివరాలు.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్, అతని భార్య మానస, వారి కుమారులు ఇరువురు చిన్నపిల్లలు, అదే గ్రామానికి చెందిన .అతని మిత్రుడు ముద్దం చంద్రశేఖర్ లు కలసి గత మూడు రోజుల క్రితం కారులో తిరుపతి దైవదర్శనానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో శ్రీశైలం వస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని గిద్దలూరు వద్ద బుధవారం చాణిక్య పాఠశాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . దీంతో కారులో ప్రయాణిస్తున్న ముద్దం చంద్రశేఖర్( 38) (2 ) సంవత్సరాల వయసు గల బాబు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సంఘటన విషయం తెలుసుకున్న గిద్దలూరు పోలీసులు తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే గిద్దలూరు లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామంలో విషాద ఛాయలు ఎలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు