Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : కొనసాగుతున్న TOSS అడ్మిషన్లు 2026-27.. ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో చేరేందుకు ఇదే మంచి అవకాశం..!

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Miryalaguda : కొనసాగుతున్న TOSS అడ్మిషన్లు 2026-27.. ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో చేరేందుకు ఇదే మంచి అవకాశం..!

మన సాక్షి, ప్రతినిధి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చదువు మధ్యలో ఆపివేసిన వారు, పదో తరగతి లేదా ఇంటర్‌ను పూర్తి చేయలేకపోయిన వారికి మరోసారి తమ విద్యను కొనసాగించే అవకాశం లభిస్తోంది. చెన్నైపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సైదిరెడ్డి, కో-సహాయ కోఆర్డినేటర్ మాలోతు దశరత్ నాయక్ మాట్లాడుతూ, చదువు మానేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • 10వ తరగతి చదువు మధ్యలో మానేసిన వారు.
  • పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ చదవలేకపోయిన వారు.
  • ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు.
  • విద్యను కొనసాగించాలనుకునే ఇతర అర్హులైన అభ్యర్థులు.

అవసరమైన పత్రాలు

ఓపెన్ టెన్త్ అడ్మిషన్లకు 

  • రికార్డు షీట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ఓపెన్ ఇంటర్ అడ్మిషన్లకు :

  • 10వ తరగతి పాస్ మెమో
  • టీసీ (TC)
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

📞 98495 73645
📞 85559 17912

మరిన్ని వార్తలు