MLA: ఓటు హక్కు అత్యంత విలువైన శక్తి.. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్..!
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న సర్ ప్రక్రియ ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ శనివారం పరిశీలించారు.

MLA: ఓటు హక్కు అత్యంత విలువైన శక్తి.. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్..!
చింతపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న సర్ ప్రక్రియ ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ శనివారం పరిశీలించారు. ఓటర్ సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమం ను విజయవంతం గా పూర్తి చెయ్యాలని అన్నారు,ఓటు హక్కు ప్రజా స్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన రాజ్యాంగ బద్ధమైన హక్కు అని అన్నారు.
అర్హత కలిగిన ఒక్క ఓటర్ పేరు కుడా ఓటర్ జాబితా నుండి తొలగి పోకుండా బి ఎల్ ఏ లు, బి ఎల్ ఓ డి లు , కాంగ్రేస్ పార్టీ నాయకులు సమన్వయము తో పనిచేయ్యాలని సూచించారు. సర్ ప్రక్రియ లో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ వివరాలు పరిశీలించి అవసరమైన పత్రాలను సకాలంలో లో సమర్పించేలా ప్రజలకు అవగాహనా కల్పించాలని తెలిపారు. ఎలాంటి పొరబాట్లు జరగకుండా ప్రతి బూత్ లో ప్రత్యేక శ్రేద్ద తీసుకోవాలని అన్నారు.
ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత ను వివరిస్తూ ఓటర్ జాబితాలో పేరు ఉండటం అత్యంత అవసరం అని ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటు హక్కు కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నల్ల సుమిత రఘుమారెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రక్రియ ను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ వివరాలు సరిచేసుకోవాలని కోరారు. అదేవిధంగా 44,45 రెండు బూత్ల లో 100%సర్ ప్రక్రియను పూర్తి చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలొ తాసిల్దార్ విజయలక్ష్మి ఆర్ ఐ సునీత మరియు కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి. మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి . డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు హరి నాయక్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ నల్ల సుధాకర్ రెడ్డి, చింతపల్లి సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్ , మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం . నర్సింహా.గ్రామ వార్డ్ మెంబెర్ లు,గ్రామ సెక్రటరీ. బి ఎల్ ఎ లు, బి ఎల్ ఓ లు, పెద్దలు గ్రామ ప్రజలు. కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









