TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ
Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్ని జలకలతో నిండాయి.

Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్ని జలకలతో నిండాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి కూడా గేట్ల ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది.
జూరాల జలాశయం నుంచి 1,31 894 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం జలాశ నీటిమట్టం 833.50 అడుగులకు చేరింది. జలాశయ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 833.50 అడుగులకు చేరింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 53. 2754 టీఎంసీలుగా ఉంది. మరో వారం రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.









