Miryalaguda : మిర్యాలగూడలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ సంచలన నిర్ణయం.. రైస్ మిల్లర్స్ సహకారంతో అద్దె ఇంటి వాసులకు అండగా..!
మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైస్ మిల్లర్స్ సహకారంతో స్మశాన వాటికలో గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ సంచలన నిర్ణయం.. రైస్ మిల్లర్స్ సహకారంతో అద్దె ఇంటి వాసులకు అండగా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైస్ మిల్లర్స్ సహకారంతో స్మశాన వాటికలో గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. అద్దె ఇళ్లలో నివాసముంటూ, కుటుంబ సభ్యుల మరణంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒక మానవీయ నిర్ణయం తీసుకున్నారు.
పట్టణంలోని హిందూ స్మశానవాటికలో రైస్ మిల్లర్ల సహకారంతో ప్రత్యేకంగా రెండు గృహాలను నిర్మించనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.. శుక్రవారం మిర్యాలగూడ హిందూ స్మశానవాటికను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాల్లో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే. ఇల్లు కీడు అవుతుందనే అంధ విశ్వాసాలతో యజమానులు మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని సంఘటనలు ఇటీవల ఎంతోమందిని కలచివేశాయి.
కన్నవారిని, కట్టుకున్న వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలు, శవాన్ని రోడ్డుపై పెట్టుకుని నరకయాతన అనుభవించిన దయనీయ పరిస్థితులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి మానవీయ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే తపనతోనే స్మశానవాటిక ఆవరణలోనే రెండు సకల సౌకర్యాలతో కూడిన గృహాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు బిఎల్ఆర్ తెలిపారు.
మృతదేహాన్ని రోడ్లపై లేదా అనాథగా ఉంచాల్సిన అవసరం లేకుండా,అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు గౌరవ ప్రదంగా ఈ గృహాలలో ఉండవచ్చన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు వేచి ఉండటానికి, ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఇళ్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ సామాజిక దృక్పథంతో కూడిన నిర్మాణానికి స్థానిక రైస్ మిల్లర్ల సహకారాన్ని సమీకరించి, త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనంతరం స్మశానవాటికలో విపరీతంగా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను వెంటనే తొలగించి, ఆవరణను ఎప్పటికప్పుడు అద్దంలా శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను తీవ్రంగా ఆదేశించారు. స్మశానవాటికను అన్ని సౌకర్యాలతో వైకుంఠధామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
MOST READ
- Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- CM Revanth Reddy : సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇక వారందరికి పింఛన్లు, ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ఆదేశం..!
- District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. లిఫ్టుల రక్షణ రైతులదే బాధ్యత..!
- Karimnagar : సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు.. దోపిడీ కేసు చేదించిన పోలీసులు..!









