Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG న్యూస్ : తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR)కు మరోసారి గడువు పొడిగింపు.. షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియ ను భారత ఎన్నికల సంఘం ఈసీ మరోసారి పొడిగించింది.

TG న్యూస్ : తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR)కు మరోసారి గడువు పొడిగింపు.. షెడ్యూల్ ఇదే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియ ను భారత ఎన్నికల సంఘం ఈసీ మరోసారి పొడిగించింది. ఆగస్టు 3వ తేదీతో ముగియాల్సిన ఈ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 77.12 శాతం సర్వే పూర్తయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నందున గడువును పెంచాల్సి వచ్చింది. ఈ సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఓటర్లను నిర్ధారించటం, నకిలీ ఓట్లను గుర్తించడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఓటర్ల జాబితా సవరణకు గాను మొదట జూలై 24 వ తేదీ వరకు గడువు విధించగా ఎన్నికల సంఘం మొదటిసారి ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగించింది. కాగా మరోసారి గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు