Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయం

జూరాలకు హోరెత్తిన వరద.. 27 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

జూరాలకు హోరెత్తిన వరద.. 27 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

మన సాక్షి, వెబ్ డెస్క్ ::

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి దిగువకు 27 గేట్లు ఎత్తి 2.18 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తి 1,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా విద్యుత్ కేంద్రం ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,55,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది.

Most Read : 

మరిన్ని వార్తలు