Miryalaguda : మిర్యాలగూడలో ఛాత్రోన్ కీ గూంజ్..!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన శిక్షా రేవల్యూషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం విక్షించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఛాత్రోన్ కీ గూంజ్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన శిక్షా రేవల్యూషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం విక్షించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, పాల్గొని, విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో కలిసి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల గొంతుకను వినడం, వారి సమస్యలను పరిష్కరించడం, నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తు అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు.
విద్యార్థుల ఆకాంక్షలు, అభిప్రాయాలు, సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.. ఛాత్రోన్ కీ గూంజ్ ద్వారా విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు, విద్య, ఉపాధి తదితర అంశాలపై తమ గొంతును వినిపించే అవకాశం కలిగిందన్నారు.
దేశ నిర్మాణంలో యువత, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరు సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేష్, దేశిడి శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










