TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ
Srisailam : శ్రీశైలంలో 877.70 అడుగుల నీరు.. సాగర్ కు చేరుతున్న నీరు..!
కృష్ణ నది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద నీరు శ్రీశైలంకు చేరుతుంది.

Srisailam : శ్రీశైలంలో 877.70 అడుగుల నీరు.. సాగర్ కు చేరుతున్న నీరు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణ నది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద నీరు శ్రీశైలంకు చేరుతుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులో జలాశ నీటిమట్టం 877.70 అడుగులుగా నమోదయింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. రెండు కేంద్రాల నుంచి 62,493 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ కు చేరుతుంది.
ఆల్మట్టి డ్యాంకు 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు 2.42 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 1.26 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.









