Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

Cyber : ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఖాతా ఖాళీ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..!

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన పరుస్తున్నప్పటికీ కూడా నేరగాళ్లు కూడా కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

Cyber : ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఖాతా ఖాళీ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన పరుస్తున్నప్పటికీ కూడా నేరగాళ్లు కూడా కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అతడు లిఫ్ట్ చేయగానే అతని ఖాతాలో ఉన్న 70000 రూపాయలు మాయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ పండ్ల వ్యాపారి శాంతి బాబుకు గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

శాంతి బాబు ఫోన్ లిఫ్ట్ చేయగా హిందీలో మాట్లాడాడు అవతలి వ్యక్తి. ఆ తర్వాత రెండు కొత్త యాప్ లు ఫోన్లోకి వచ్చాయి. ఫోన్ వెంటనే హ్యాంగ్ అయింది. ఇంటికి వెళ్లి చూసేసరికి బ్యాంకు ఖాతాలోని 70000 రూపాయలు మాయం అయ్యాయి. మోసపోయానని గ్రహించిన శాంతి బాబు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు