భర్తను హత్య చేసిన భార్య.. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ..!
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రికరించేందుకు ప్రయత్నం చేసింది.

భర్తను హత్య చేసిన భార్య.. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ..!
మన సాక్షి, మదనపల్లి :
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రికరించేందుకు ప్రయత్నం చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి జిల్లా పీలేరులో చోటుచేసుకుంది. మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లి జిల్లా పీలేరు కు చెందిన ఉమాదేవి వెంకటసుబ్రహ్మణ్యం భార్యాభర్తలు.
వీరికి రెండేళ్ల నుంచి విభేదాలు మొదలయ్యాయి. ఉమాదేవికి చార సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ రోజు రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఉమాదేవి తన భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తిన్న తర్వాత భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి హత్య చేశారు.
అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తిరుపతి మదనపల్లె రోడ్డుపై పడేశారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ పోలీసులు డెడ్ బాడీని చూస్తే అనుమానం వచ్చింది. దాంతో విచారణ జరపగా భర్తని ప్రియుడితో కలిసి తాను హత్య చేసినట్లుగా భార్య ఒప్పుకుంది. దాంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.









