Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : మిర్యాలగూడ ఫోక్సో కేసులో.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు..!

నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మిర్యాలగూడ చెందిన ఈ కేసులో నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Nalgonda : మిర్యాలగూడ ఫోక్సో కేసులో.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు..!

మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :

నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మిర్యాలగూడ చెందిన ఈ కేసులో నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలో 2020 మే 30వ తేదీన దారుణమైన సంఘటన జరిగింది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన మైనర్ బాలికను మహమ్మద్ జాకీర్ బాబా అనే వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయగా కేసు వాదనలు విన్న ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు తీర్పు వెలువరించారు. నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.

MOST READ 

మరిన్ని వార్తలు