Free Insurence : రూ.5 లక్షల ఉచిత ప్రభుత్వ ఇన్సూరెన్స్.. ఇంట్లో ఉండే కార్డు పొందొచ్చు..!
ఐదు లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ ను ఇంట్లో ఉండే పొందవచ్చును. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కేవలం వాట్సాప్ లో Hi అని పెడితే చాలు పొందే అవకాశం ఉంది.

Free Insurence : రూ.5 లక్షల ఉచిత ప్రభుత్వ ఇన్సూరెన్స్.. ఇంట్లో ఉండే కార్డు పొందొచ్చు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఐదు లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ ను ఇంట్లో ఉండే పొందవచ్చును. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కేవలం వాట్సాప్ లో Hi అని పెడితే చాలు పొందే అవకాశం ఉంది. దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PM – JAY ) అనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను అందిస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది.
అయితే ఈ హెల్త్ కార్డు కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండి మీ మొబైల్ ఫోన్లోని అధికారిక వాట్స్అప్ ద్వారా ఇంట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చును. ఇంట్లో కూర్చొని దరఖాస్తు చేసుకోవడంతో పాటు కార్డు కూడా ఉచితంగా మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నెంబర్ +9172908 23838 కు Hi లేదా Hello అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. వాట్సాప్ చాట్ బాట్ సూచనల ప్రకారం.. మై ఆయుష్మాన్ కార్డు ఆప్షన్ ఎంచుకొని ఈ కేవైసీ పూర్తి చేసి నేరుగా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చును.
కేవలం వాట్సాప్ లో మాత్రమే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్
beneficiary.nha.gov.in
సందర్శించి మొబైల్ నెంబర్ ఓటిపి ద్వారా లాగిన్ కావాలి. దాంట్లో రాష్ట్రం, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ పూర్తి పేరు గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలు సెర్చ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసి అవసరమైన వివరాలను నింపి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులు అవుతారు. వీరితోపాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ స్కీం వర్తింపు లభిస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ సులభమైన విధానాన్ని ఉపయోగించుకొని ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును పొంది ప్రయోజనాలను పొందవచ్చును.
MOST VIEWS :
- శ్రీశైలంలోకి నిలకడగా వరద, నాగార్జున సాగర్ లోకి 76,416 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!
- Cyber : ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఖాతా ఖాళీ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..!
- Srisailam : శ్రీశైలం కు తగ్గిన వరద.. జూరాల గేట్లు మూసివేత..!
- Srisailam : శ్రీశైలంలో 877.70 అడుగుల నీరు.. సాగర్ కు చేరుతున్న నీరు..!









